టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్షల సిలబస్ విడుదల
హైదరాబాద్: గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ను విడుదల చేసింది. 90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని సిలబస్ విడుదల సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. జులై 27న ప్రభుత్వం స్కీంను ఆమోదించిందిని వెల్లడించారు. గ్రూప్స్ 1, 2, 3, 4తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం సిలబస్ తయారు చేసినం. సిలబస్ తక్షణం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు. సిలబస్ రూపొందించిన మేధావులకు, ప్రొఫేసర్లకు ధన్యవాదాలు. సిలబస్ కమిటీలో ఉన్న 32 మంది సభ్యులకు టీఎస్‌పీఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర పొందుపర్చామన్నారు.
AUTHOR ;- BELLAPURI SAIKUMAR
No comments:
Post a Comment